Share News

ఇరాన్‌లోకి అమెరికా సైనికులు?.. మరోసారి దాడులకు అగ్రరాజ్యం సిద్ధమవుతోందా..

ABN , Publish Date - May 16 , 2026 | 07:01 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన రెండు శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై దాడులు చేయాలని భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇరాన్‌లోకి అమెరికా సైనికులు?.. మరోసారి దాడులకు అగ్రరాజ్యం సిద్ధమవుతోందా..
Trump Iran strikes

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా రెండు సార్లు జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై దాడులు చేయాలని భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈసారి నేరుగా ఇరాన్ భూభాగం పైకి అమెరికా సేనలను పంపించాలని భావిస్తున్నారట (Trump Iran strikes).


ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అవసరమైతే ఇరాన్ అణు పదార్థాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక సైనికులను పంపే అంశం కూడా పరిశీలనలో ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో సైనిక బలగాలను మోహరించింది. ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అదనంగా వేలాది మంది సైనికులను పంపే అంశాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది (US ground troops Iran).


కాగా, ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైనికులను పంపాలనే ఆలోచనపై రాజకీయ చర్చ తీవ్రంగా సాగుతోంది (Trump Iran policy). కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌లోకి భూసేనలను ప్రవేశపెట్టకూడదని కొందరు రిపబ్లికన్ నేతలు హెచ్చరిస్తున్నారు. పూర్తి స్థాయి యుద్ధం అమెరికాకు భారీ నష్టాలు తీసుకురావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


ఇవి కూడా చదవండి..

తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం: ట్రంప్


పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

Updated Date - May 16 , 2026 | 07:05 PM