అత్యంత స్వచ్ఛ నగరం లఖ్‌నవూ!
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:06 AM
దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ తొలి స్థానం దక్కించుకుంది...
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో ఫస్ట్ ర్యాంకు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ తొలి స్థానం దక్కించుకుంది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026 సర్వేలో 200లకుగాను 198 పాయింట్లు దక్కించుకుని ముందు స్థానంలో నిలిచింది. గత ఏడాది 200లకు 200పాయింట్లు దక్కించుకున్న ఇండోర్.. ఈ సారి 197 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. దేశంలో 10 లక్షలకన్నా ఎక్కువ మంది జనాభా ఉన్న నగరాల్లో ఈ రెండు నగరాలు.. 1, 2 స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 172 పాయింట్లతో 21వ స్థానం, ముంబై 160.8 పాయింట్లతో 28వ స్థానం దక్కించుకున్నాయి. మొత్తం 3 విభాగాలుగా ఈ సర్వే సాగింది. 1) 10 లక్షలకన్నా ఎక్కువ మంది జనాభా. 2) 3-10 లక్షల జనాభా. 3) 3 లక్షలకన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలు. మూడు లక్షల నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న టాప్10 స్వచ్ఛ నగరాల్లో గుంటూరు, అమరావతి స్థానం దక్కించుకున్నాయి. 3లక్షలలోపు జనాభా ఉన్న స్వచ్ఛమైన నగరాల జాబితాలో ఏలూరు, విజయనగరం, సంగారెడ్డి, నల్గొండ చోటు సంపాదించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News