ఎల్‌పీజీ బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు
ABN , Publish Date - Mar 09 , 2026 | 08:05 PM
దేశీయ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు సంబంధించి నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక సిలెండర్ డెలివరీ తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడడానికి కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు కేంద్రం పెంచినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: దేశీయ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు సంబంధించి నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక సిలెండర్ డెలివరీ తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడడానికి కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు కేంద్రం పెంచినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిలిండర్లు నిల్వచేసుకోవడం, బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వలన కలిగే ఇంధన సరఫరా అంతరాయాలను అధిగమించేందుకు కేంద్రం తాజా చర్యలు చేపట్టింది. చమురు రిఫైనరీలకు ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని, వాణిజ్య అవరసరాల కంటే గృహ అవసరాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది.
కాగా, ఇంతకుముందు 55 రోజులకు సిలిండర్లు బుకింగ్ చేసుకునే వారు ఇప్పుడు 15 రోజుల్లోనే సిలెండర్లు బుక్ చేసుకుంటున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రం సైతం ఎల్జీపీ భాగస్వాముల కోసం ప్రయత్నాలు చేస్తోందని, అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే దేశాలు ఇండియాకు ఎల్పీజీ అమ్మేందుకు సంప్రదింపులు సాగిసున్నాయని ఆ వర్గాలు చెప్పాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవచ్చు
క్రూడాయిల్ బ్యారెల్ ధర 130 డాలర్లు దాటనంత వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ వద్ద తగినన్ని ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నాయి. క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర 100 డాలర్లు దాటకపోవచ్చని అంచనా వేస్తున్నామని, దేశంలోని ఏ ఒక్క పెట్రోల్ బంక్‌లోనూ పెట్రోల్, డీజిల్ కొరత ఉండదని ఆ వర్గాలు చెప్పాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ నిల్వలు కూడా తగినంత ఉన్నాయని, ఏటీఎఫ్ ఉత్పత్తి, ఎగుమతిదారుగా ఇండియా ఉన్నందున ఏటీఎఫ్ గురించి ఆందోళన అవసరం లేదని కూడా తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
మాంచెస్టర్‌కు బయలుదేరి ఢిల్లీకి యూటర్న్ తీసుకున్న ఇండిగో
కరూర్ కేసు: విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు