Share News

ఢిల్లీ అల్లర్ల కుట్రకేసు నిందితుడు షర్జీల్ ఇమామ్‌కు తాత్కాలిక బెయిలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 06:30 PM

దేశ రాజధానిలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో నిందితునిగా ఉన్న షర్జీల్ ఇమామ్‌కు ఢిల్లీ కోర్టు 10 రోజుల తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు, అస్వస్థతతో ఉన్న తల్లిని చూసేందుకు కోర్టు ఈ ఉపశమనం కల్పించింది.

ఢిల్లీ అల్లర్ల కుట్రకేసు నిందితుడు షర్జీల్ ఇమామ్‌కు తాత్కాలిక బెయిలు
Sharjeel Imam

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో నిందితునిగా ఉన్న షర్జీల్ ఇమామ్ (Sharjeel Imam)కు ఢిల్లీ కోర్టు 10 రోజుల తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు, అస్వస్థతతో ఉన్న తల్లిని చూసేందుకు కోర్టు ఈ ఉపశమనం కల్పించింది. ఈనెలలో తన సోదరుడి వివాహం ఉన్నందున ఆరు వారాల పాటు తనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని ఇమామ్ కోర్టును కోరారు. దీనిపై అదనపు సెన్షన్స్ న్యాయమూర్తి సమీర్ బాజ్‌పేయి విచారణ చేపట్టారు. అనంతరం మార్చి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ తాత్కాలిక బెయిలు మంజూరు చేశారు.


ఈ ఏడాది జనవరిలో తనకు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఇమామ్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయనతో పాటు స్టూడెంట్ యాక్టివిస్ట్ ఉమర్ ఖలీద్‌కు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే ఈ కేసులో సహనిందితులైన ఐదుగురికి సుప్రీం ధర్మాసనం బెయిలు మంజూరు చేసింది.


ఈశాన్య ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో సీఏఏ వ్యతిరేక నిరసలు హింసాత్మకంగా మారిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 53 మంది దుర్మరణం పాలయ్యారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ యూఏపీఏ కింద ఛార్జిషీటు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి..

సీఈసీ గోబ్యాక్ నినాదాలు, నల్లజెండాలతో నిరసనలు

మాంచెస్టర్‌కు బయలుదేరి ఢిల్లీకి యూటర్న్ తీసుకున్న ఇండిగో

Updated Date - Mar 09 , 2026 | 06:36 PM