కాలం అనుకూలిస్తే రాజకీయాల్లోకి వస్తా..
ABN , Publish Date - May 08 , 2026 | 01:27 PM
కాలం కలిసి వస్తే భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ వస్త్ర వ్యాపారి, సినీ నటుడు లెజెండ్ శరవణన్ పేర్కొన్నారు.
లెజెండ్ శరవణన్
చెన్నై: కాలం కలిసి వస్తే భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ వస్త్ర వ్యాపారి, సినీ నటుడు లెజెండ్ శరవణన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముగిసిన ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే పార్టీ అవినీతి రహిత పాలన అందించాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రజలపై పన్నుల భారం మోపరాదని, అనవసరమైన ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకుని, అన్ని వర్గాల ప్రజలకు ఒక సంతోషకరమైన జీవితాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు.
కొళత్తూరులో స్టాలిన్ ఓడిపోవడం సాధారణంగా ప్రతి రాజకీయ నేతకు ఎదురయ్యే సంఘటనేనని, రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధారణమన్నారు. ఈ తరహా ఓటమి ప్రజల్లో విప్లవం వచ్చినపుడే ఎదురవుతుందన్నారు. గతంలో కూడా ఈ తరహా గెలుపోటములు పాతతరం నేతలకు ఎదురైవుంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, సీఎంగా బాధ్యలు స్వీకరించే విజయ్‌కు అభినందనలు తెలిపారు. సినిమాపై తనకు అమితమైన ఆసక్తి ఉందన్నారు. అయితే, విజయ్ స్థానాన్ని తాను భర్తీ చేస్తానా లేదా అన్నది తెలియదని లెజెండ్ శరవణన్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గాడిదలు మేపుతున్న పీఎంకే మాజీ ఎమ్మెల్యే
Read Latest Telangana News and National News