చిన్నారికి తప్పిన బస్సు ప్రమాదం.. వీడియో వైరల్
ABN , Publish Date - Feb 02 , 2026 | 09:23 PM
కోజికోడ్ జిల్లాలో ఒక చిన్నారికి బస్సు ప్రమాదం తప్పింది. కొడియత్తూర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: కేరళ (Kerala) లోని కోజికోడ్ జిల్లా(Kozhikode district)లో కోడియత్తూర్ ప్రాంతంలో ఒక చిన్నారి ఉన్నట్టుండి రోడ్డు వైపు పరుగెత్తింది. అదే సమయానికి బస్సు వేగంగా దూసుకొచ్చింది. అదృష్టవశాత్తూ, బస్సు డ్రైవర్(Bus driver) చాకచక్యంగా వ్యవహరించి చిన్నారికి ప్రమాదం కాకుండా వ్యవహరించారు. దీంతో చిన్నారికి తృటిలో పెద్ద ప్రమాదం(accident) తప్పింది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ వీడియోలో, ఒక చిన్నారి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోరిక్షా వెనుక నుండి అకస్మాత్తుగా రోడ్డువైపు పరుగెత్తింది, అప్పటికే వేగంగా బస్సు దూసుకువస్తుంది. చిన్నారిని గమనించిన డ్రైవర్ ఎంతో నేర్పుగా బస్సు దిశ మార్చడంతో పాటు వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో చిన్నారికి పెద్ద ప్రమాదం తప్పిపోయింది. చిన్నారి వెంటనే వెనుకకు పరుగెత్తింది. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డ్రైవర్ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నారు. చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలిన తల్లిదండ్రులపై మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం
సీజే రాయ్ కేసు.. వెలుగులోకి 9 పేజీల సూసైడ్ నోట్