Share News

బైక్‌ వెనక సీట్లో కూర్చున్నా పరిహారానికి అర్హుడే

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:02 AM

రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో బైక్‌ వెనకసీటుపై కూర్చొన్న వ్యక్తికి కూడా పరిహారం పొందే అర్హత ఉందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

బైక్‌ వెనక సీట్లో కూర్చున్నా పరిహారానికి అర్హుడే

తిరువనంతపురం, జూలై 28: రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో బైక్‌ వెనకసీటుపై కూర్చొన్న వ్యక్తికి కూడా పరిహారం పొందే అర్హత ఉందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. బైకును నడిపిన డ్రైవర్‌ నిర్లక్ష్యం ఉందన్న కారణంతో అమాయకుడైన ప్రయాణికుడికి నష్టం కలిగించకూడదని పేర్కొంది. 2004లో బైక్‌పై వెనక సీట్లో కూర్చొని వెళ్తున్న ఓ వ్యక్తిని బస్సు ఢీ కొనడంతో ఆయన గాయపడ్డాడు. విచారణ జరిపిన ఎర్నాకుళంలోని మోటార్‌ యాక్సిడెంట్స్‌ క్లెయమ్స్‌ ట్రైబ్యునల్‌ ఆయన రూ.57,992 పరిహారం చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. అయితే బీమా కంపెనీ ఈ ప్రమాదానికి బైక్‌ను నడిపిన వ్యక్తి తప్పు కూడా ఉందని భావించి పరిహారాన్నిసగానికి తగ్గించింది. దీంతో ఆయన హైకోర్టులో అప్పీలు చేయగా.. కోర్టు వడ్డీతో సహా బాధితుడికి పరిహారం చెల్లించాలంది.

Updated Date - Jul 29 , 2026 | 08:03 AM