Share News

విషాదం.. చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన ప్లాస్టిక్ బంతి తిని చిన్నారి మృతి

ABN , Publish Date - Aug 03 , 2026 | 08:02 AM

చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బంతి ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఆహారం అనుకుని నోట్లో వేసుకున్న బంతి గొంతులో ఇరుక్కుపోవడంతో కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది.

విషాదం.. చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన ప్లాస్టిక్ బంతి తిని చిన్నారి మృతి
Mysuru News

ఇంటర్నెట్ డెస్క్: చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బంతి ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హుణసూరు తాలూకా గౌరీపుర గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష్, ఐశ్వర్య దంపతుల మూడేళ్ల కుమారుడు మయూర్ ఏడుస్తుండగా ఇంటికి వచ్చిన బంధువు అతడికి ఓ చిప్స్ ప్యాకెట్ కొనిచ్చాడు. ఆ ప్యాకెట్‌లో వచ్చిన ప్లాస్టిక్ బంతిని బాలుడు ఆహారమని భావించి నోట్లో వేసుకున్నాడు. అది ప్రమాదవశాత్తూ గొంతులో ఇరుక్కుపోవడంతో చిన్నారి ఊపిరాడక విలవిల్లాడాడు.


కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని హుణసూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారులకు ఆహార పదార్థాలతో పాటు వచ్చే చిన్న ప్లాస్టిక్ బొమ్మలు, బంతులు వంటి వస్తువులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Aug 03 , 2026 | 08:22 AM