పర్వతారోహకుడు నిర్మల్ మృతదేహం లభ్యం
ABN , Publish Date - Aug 03 , 2026 | 06:40 AM
పాక్ ఆక్రమిత కశ్మీర్ కారాకోరం పర్వత శ్రేణుల్లోని బ్రాడ్ పీక్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతిచెందిన పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా(43) మృతదేహం...
పీఓకేలోని బ్రాడ్ పీక్ పర్వతంపై గుర్తింపు
ముజఫరాబాద్, ఆగస్టు 2: పాక్ ఆక్రమిత కశ్మీర్ కారాకోరం పర్వత శ్రేణుల్లోని బ్రాడ్ పీక్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతిచెందిన పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా(43) మృతదేహం లభ్యమైంది. పర్వతంపై 5,700 మీటర్ల ఎత్తులో పుర్జా మృతదేహంతో పాటు మరో మూడు మృతదేహాలను అధికారులు గుర్తించారు. పర్వతం కింద ఉన్న జపాన్ క్యాంప్‌నకు వీటికి తరలించారు. మూడు రోజుల క్రితం 8051 మీటర్ల ఎత్తున్న బ్రాడ్ పీక్ పర్వతాన్ని పుర్జా బృందం అధిరోహిస్తుండగా భారీ హిమపాతం విరుచుకుపడింది. ఆయనతో పాటు ఉన్న పది మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో జన్మించిన పుర్జా బ్రిటన్ గూర్ఖా బ్రిగేడ్ మాజీ సభ్యుడు. 2019లో ఆయన 8వేల మీటర్ల కన్నా ఎత్తయిన 14 పర్వతాలను 6 నెలల వ్యవధిలో అధిరోహించి ప్రఖ్యాతిగాంచారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..