కేంద్రం కరువు నిధులు ఇవ్వకున్నా ప్రతి రైతుకు రూ.5 వేలు పరిహారం: శివకుమార్
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:49 AM
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా, రాష్ట్రంలోని ప్రతి రైతుకు రెండు విడతల్లో రూ.5 వేలు పరిహారం ఇస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు.
బెంగళూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా, రాష్ట్రంలోని ప్రతి రైతుకు రెండు విడతల్లో రూ.5 వేలు పరిహారం ఇస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక వ్యాప్తంగా తీవ్రమైన కరువు నెలకొందన్నారు. రైతులకు తొలి విడత రూ.2,500 చొప్పున పరిహారం విడుదల చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కరువు పరిస్థితిని వివరించామని, త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రికి వినతిపత్రం ఇస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా, రావడం ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల ఖాతాలకు నేరుగా కరువు పరిహారం జమచేస్తుందని ఆయన స్పష్టంచేశారు. కాగా, రైతులకు పరిహారం చెల్లింపును ఈ నెల 5నే యాదగిరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు