సోమరులు.. అసమర్థులు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం..
ABN , Publish Date - Sep 05 , 2026 | 07:27 PM
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ అభివృద్ధి పనులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజాగా సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో అధికారులను ఆమె గట్టిగా నిలదీశారు.
ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ అభివృద్ధి పనులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజాగా సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో అధికారులను ఆమె గట్టిగా నిలదీశారు. సుమారు రూ.11 కోట్ల ఎంపీ నిధులు విడుదలైనా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వారిని ' సోమరులు, పూర్తిగా అసమర్థులు' అంటూ ఆమె విమర్శించారు (Kangana Ranaut Mandi officials).
మండి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులపై అధికారులు పదేపదే హామీలు ఇస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పనులు కనిపించడం లేదని కంగన మండిపడ్డారు. ఇక మాటలు చెప్పడం ఆపి.. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ నిధుల వినియోగంపై గత సమావేశాల్లో కూడా తాను ప్రశ్నించానని, అప్పుడు నిధుల వినియోగంలో ఎలాంటి సమస్యా లేదని అధికారులు చెప్పారని ఆమె అన్నారు. అయితే తర్వాత బయటి సంస్థల సర్వేలతో అసలు పరిస్థితి బయటపడిందని కంగన పేర్కొన్నారు (Mandi MPLADS funds).
మండి నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు (Kangana Ranaut officials). భూమి అందుబాటులో లేకపోవడం, అవసరమైన అనుమతులు రాకపోవడం వంటి కారణాలతో కొన్ని పనులు ఆలస్యమైనట్లు చెప్పారు. అయితే ఈ కారణాలు చెబుతూ పనులను మరింత ఆలస్యం చేయడానికి వీల్లేదని కంగన స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయిందని, ఇకపై ప్రతి పనికి స్పష్టమైన పురోగతి ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..
9/11 దాడులు.. వారం ముందే అమెరికాకు హెచ్చరిక..