Share News

జెలెన్‌స్కీ కాల్పుల విరమణ ప్రతిపాదన.. కీవ్‌పై 3 రోజులు దాడులు చేయబోమన్న పుతిన్..

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:16 PM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు మరోసారి దౌత్య ప్రయత్నాలు జోరందుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మూడు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

జెలెన్‌స్కీ కాల్పుల విరమణ ప్రతిపాదన.. కీవ్‌పై 3 రోజులు దాడులు చేయబోమన్న పుతిన్..
Putin Kyiv ceasefire

ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు మరోసారి దౌత్య ప్రయత్నాలు జోరందుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మూడు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్.. రష్యా, ఉక్రెయిన్ పర్యటనలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది (Putin Kyiv ceasefire).


రష్యా-ఉక్రెయిన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం ప్రతిపాదన చేశారు. అమెరికా ప్రతినిధులు రష్యా, ఉక్రెయిన్‌లలో చర్చలు జరిపే సమయంలో ఉక్రెయిన్ వైపు నుంచి వైమానిక దాడులు ఉండవని జెలెన్‌స్కీ చెప్పారు. అదే సమయంలో రష్యా కూడా దాడులను నిలిపివేయాలని కోరారు. ఇరు దేశాలు కనీసం చర్చలు జరిగేంత సమయం పాటు దాడులు ఆపితే.. శాంతి చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు (Zelensky ceasefire proposal).


జెలెన్‌స్కీ ప్రతిపాదన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కీవ్‌పై మూడు రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఆదేశించినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ తాత్కాలిక విరామం శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతుందని రష్యా తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మరోసారి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కోకు వెళ్లారు. అక్కడ రష్యా అధికారులతో చర్చించిన అనంతరం కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం కానున్నారు (Russia Ukraine war).


యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా వద్ద ఒక కొత్త శాంతి ప్రతిపాదన ఉందని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు (US envoys Ukraine Russia). ఇటీవల పుతిన్ కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా, చైనా సహా పలు దేశాలు శాంతి పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే చివరకు సమస్యను పరిష్కరించాల్సింది మాత్రం రష్యా, ఉక్రెయిన్‌లేనని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..


9/11 దాడులు.. వారం ముందే అమెరికాకు హెచ్చరిక..

Updated Date - Sep 05 , 2026 | 06:16 PM