రిజైన్ చేశాక తొలగింపు ప్రక్రియ కొనసాగొద్దు
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:08 AM
న్యాయమూర్తి పదవికి తాను రాజీనామా చేసిన తర్వాత.. జడ్జి స్థానం నుంచి తనని తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ కొనసాగించకూడదని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ స్పష్టం చేశారు
లోక్‌సభకు ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ వర్మ లేఖ
న్యూఢిల్లీ, నవంబరు 20: న్యాయమూర్తి పదవికి తాను రాజీనామా చేసిన తర్వాత.. జడ్జి స్థానం నుంచి తనని తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ కొనసాగించకూడదని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ స్పష్టం చేశారు. రాజీనామా చేశానంటే తప్పు చేశానని అంగీకరించినట్టు కాదని వెల్లడించారు. గతేడాది మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో మంటలు చెలరేగగా కాలిన కరెన్సీ నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ 2026 ఏప్రిల్ 9న తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు, అంతకుముందే ఆయనను జడ్జి పదవి నుంచి తొలగించే ప్రక్రియను పార్లమెంటులో ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ వర్మ తాజాగా లేఖ రాశారు. రాజీనామా చేసిన జడ్డిని పదవి నుంచి తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ కొనసాగించడం రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం
ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు