కోట్ల మంది ఓట్లను తొలగించడాన్ని సమర్థించలేం: సుప్రీంకోర్టు జస్టిస్
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:35 PM
ఓటర్ల జాబితా నుంచి భారీ సంఖ్యలో పౌరుల పేర్లను తొలగించే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగపరంగా తీవ్ర సమస్యలకు దారితీస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ఓటర్ల జాబితా నుంచి భారీ సంఖ్యలో పౌరుల పేర్లను తొలగించే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగపరంగా తీవ్ర సమస్యలకు దారితీస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan) అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది పౌరులు ఓటు హక్కును కోల్పోయే ప్రక్రియను సమర్థించలేమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మిలియన్ల సంఖ్యలో భారతీయ పౌరులను ఓటు హక్కు నుంచి దూరం చేసే ఏ ప్రక్రియ అయినా సహజంగానే ఏకపక్షంగా, అన్యాయంగా మారుతుందని జస్టిస్ భుయాన్ అన్నారు. అలాంటి చర్య రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యను సమర్థించడానికి ఎన్ని వాదనలు చెప్పినా సరిపోవని, ఇది రాజ్యాంగానికి కీలకమైన అంశాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఓటు హక్కును కోల్పోయిన పౌరులను దేశంలో రెండో తరగతి పౌరులుగా మార్చినట్లవుతుందని వ్యాఖ్యానించారు (SIR Voter Deletion).
భారత రాజ్యాంగం ఓటు హక్కు ఉన్న పౌరులు, ఓటు హక్కు లేని పౌరులు అంటూ రెండు వర్గాలను సృష్టించదని జస్టిస్ భుయాన్ అన్నారు (Right to Vote). భారత పౌరుడి ఓటు హక్కును పౌరసత్వం నుంచి వేరు చేయలేమని పేర్కొన్నారు. ఓటు హక్కు లేదా ఓటర్ల జాబితాలో ఉండే హక్కును పౌరుడి నుంచి వేరు చేయడం అంటే శరీరం నుంచి ఆత్మను తీసివేయడం లాంటిదని ఆయన అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి..
భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..
బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..