జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట
ABN , Publish Date - Aug 25 , 2026 | 01:56 PM
జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండా సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది. అభిషేక్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయోధ్యలో విరాళాల చోరీకి సంబంధించిన వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని అభిషేక్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. ఈ మేరకు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తనపై తప్పుడు ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. అభిషేక్ ఉపాధ్యాయ్ అరెస్ట్‌ను నిలువరిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Also Read:
కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇళయరాజా..
జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ