Share News

మా పిల్లలకు విషం ఇస్తున్నారు

ABN , Publish Date - Mar 12 , 2026 | 01:45 PM

కేసీ వ్యాలి మురుగునీరు మూడోవిడత శుద్ధీకరణ చేయకుండానే కోలారు చెరువులకు విడుదల చేసి విషం నింపుతున్నారంటూ రంగు మారిన నీటి బాటిల్‌తో జేడీఎస్‌ ఎమ్మెల్యే మంజునాథ్‌ నిరసన తెలిపారు.

మా పిల్లలకు విషం ఇస్తున్నారు

  • శాసనసభలో రంగుమారిన నీళ్ల బాటిల్‌ను ప్రదర్శించిన జేడీఎస్‌ ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్‌

బెంగళూరు: కేసీ వ్యాలి మురుగునీరు మూడోవిడత శుద్ధీకరణ చేయకుండానే కోలారు చెరువులకు విడుదల చేసి విషం నింపుతున్నారంటూ రంగు మారిన నీటి బాటిల్‌తో జేడీఎస్‌ ఎమ్మెల్యే మంజునాథ్‌(JDS MLA Manjunath) నిరసన తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యే వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముళబాగిలు జేడీఎస్‌ ఎమ్మెల్యే సమృద్ది మంజునాథ్‌ రంగుమారిన నీటి బాటిల్‌ను సభలో ప్రదర్శించారు. బెంగళూరు మురుగనీటిని సంస్కరించి కోలారు, చిక్కబళ్ళాపుర చెరువులకు కోరమంగల-చల్లఘట్ట (కేసీ) వ్యాలీ పథకం గురించి చర్చకు కారణమైంది.


ప్రశ్నోత్తర వేళ రెండు చేతులలో తలా ఒక బాటిల్‌ను ప్రదర్శించారు. ఒక చేతిలో బెంగళూరుకు ఇస్తున్న కావేరి నీరు, మరొక చేతిలో కోలారు ప్రజలకు ఇస్తున్న కేసీ వ్యాలీ నీరు అంటూ చిన్ననీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌ఎ్‌స భోసరాజుకు చూపించారు. మీకు చేతులెత్తి విన్నవించుకుంటున్నా, మీరు మాకు భద్ర లేదా కావేరి నీరు ఇవ్వడం లేదు, మురుగునీరు ఇస్తున్నారు, దీన్ని మూడో విడత శుద్ధీకరణ కూడా చేసి ఇవ్వండి, లేకుంటే మా పిల్లలకు విషం ఇచ్చినట్టు అవుతుంది. కోలారు, చిక్కబళ్లాపురల నుంచి కాంగ్రె్‌సకు 8మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీరు ఆ ప్రజలకు మోసం చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.


  • దీనిపై మంత్రి బోసరాజు స్పందిస్తూ ఈ ప్రాంతంలో భూగర్భజలాలు 1200 అడుగులకు పడిపోవడంతో అనివార్యంగా ఈ పథకాన్ని అమలు చేశామని, ప్రస్తుతం 250-300 అడుగులకు నీరు లభిస్తోందన్నారు. ఐఐఎ్‌ససీ నుంచి పరీక్షలు జరుగుతున్నాయని, ఈ నీటి నుంచి కలిగే దుష్ప్రభావాలపై ఇంకా సమాచారం లేదన్నారు. ఈ నేపథ్యంలో మూడో దశ శుద్ధీకరణ ప్రస్తావన ప్రభుత్వం వద్ద లేదన్నారు. సమృద్ది మంజునాథ్‌ రెండు బాటిళ్లతో నీరు తెచ్చారని, ఏ బాటిల్‌లోని నీరు ఏదో తెలియదన్నారు. దీంతో మంజునాథ్‌ వెల్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. మంత్రికి ఇలాంటి తాత్సారభావం మనోభావం సరికాదన్నారు. భావితరాలకు విషం ఇస్తున్నారు, అడిగితే నీరు ఏదో అంటున్నారు. తాను శాసనసభ సభ్యుడినని, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.


  • మంత్రి కృష్ణబైరేగౌడ మాట్లాడుతూ శాస్త్రీయ చర్యలు ప్రకారం నీటిని శుద్ధీకరిస్తున్నామన్నారు. రాజకీయ కారణాలకు ఉత్తమ పనులకు అనవసరంగా మసి పూయరాదన్నారు. 2006లో భద్రా నుంచి నీరు తెస్తామని భూమిపూజ చేసినవారు ఏమీ చేయలేదన్నారు. ప్రస్తుతం అక్కడ భూగర్భజల సమస్య పరిష్కారమైందన్నారు. దీన్ని వివాదం చేయరాదన్నారు. ఒకవేళ సమస్య ఉంటే సైంటిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ఇస్తే, ఆమేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. కేసీ వ్యాలీ, హెచ్‌ఎన్‌ వ్యాలీల నీటితో నిండిన చెరువులను వరల్డ్‌ బ్యాంకు, యునైటెడ్‌ నేషన్స్‌ సంస్థల ప్రతినిధులు పరిశీలించి ప్రశంసలు ఇచ్చారన్నారు. కేంద్రప్రభుత్వ పార్లమెంటరీ కమిటీ కూడా పరిశీలించి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిఫారసు చేసిందన్నారు. బసవరాజ్‌బొమ్మై దీన్ని అనుసరించారన్నారు. ఈ నేపథ్యంలో నిష్కారణంగా ఎక్కడో ఒక పంటకు పురుగు పట్టిందని, అందుకు కేసీ వ్యాలీ, హెచ్‌ఎన్‌ వ్యాలీ నీటి నాణ్యతే కారణమనడం సరికాదన్నారు. తాము శాస్త్రీయ విధానాలతోనే నీటి సరఫరా ప్రక్రియ చేపట్టామని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో ఆల్‌టైమ్‌ రికార్డ్‌

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2026 | 01:46 PM