ఇంట్లో శవమై కనిపించిన మలయాళ నటుడు
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:16 PM
మలయాళ నటుడు హరి మురళి మృతి చెందారు. అన్నూర్‌లోని ఇంట్లో శవమై కనిపించారు. కుటుంబసభ్యులు హరి మురళి మృత దేహాన్ని పయ్యనూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
తిరువనంతపురం, మార్చి 12: మలయాళ నటుడు హరి మురళి మృతి చెందారు. అన్నూర్‌లోని ఇంట్లో శవమై కనిపించారు. కుటుంబసభ్యులు హరి మురళి మృత దేహాన్ని పయ్యనూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. హరి మరణానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. కాగా, హరి మురళి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి కే యు మురళి మలయాళంలో మంచి పేరున్న నటుడు. హరి చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్టింగ్ కెరీర్‌ను మొదలుపెట్టారు. నాలుగున్నరేళ్ల వయసులో ఏఎమ్ నజీర్ డైరెక్ట్ చేసిన సీరియల్‌లో చిన్న పాత్ర చేశారు.
ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 50 సినిమాల దాకా చేశారు. రసికన్, అన్నన్ తంబి, మొదంపి, డాన్, పట్టణ్ణత్తిల్ బూతం, ఉల్కం చుట్టుం వాలిబన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చదువు మీద దృష్టి పెట్టడం కోసం సినిమాలకు దూరం అయ్యారు. విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్‌లో బీఎస్ఈ చదివారు. చదువు పూర్తయిన తర్వాత ఎర్నాకుళంలో గ్రాఫిక్ డిజైనర్‌గా ఉద్యోగంలో చేరారు. 2015లో విడుదలైన ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ అతడి చివరి సినిమా. ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్2026 ప్రారంభానికి ముందు ధోనికి భారీ ఊరట
రెండు కనుబొమ్మలు కలిస్తే దురదృష్టమా?