Share News

జపాన్‌లో 7.1తీవ్రతతో భూకంపం

ABN , Publish Date - Jul 29 , 2026 | 06:55 AM

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 7.1గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.27గంటలకు దక్షిణ జపాన్‌లోని క్యుషు ద్వీపకల్ప అంతర్భాగంలో భూప్రకంపనలు మొదలయ్యాయి.

జపాన్‌లో 7.1తీవ్రతతో భూకంపం
Japan Earthquake

  • పాక్షికంగా కూలిన భారీ షాపింగ్‌ మాల్‌

  • కొందరు చనిపోయారని అనుమానం

న్యూఢిల్లీ, జూలై 28: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 7.1గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.27గంటలకు దక్షిణ జపాన్‌లోని క్యుషు ద్వీపకల్ప అంతర్భాగంలో భూప్రకంపనలు మొదలయ్యాయి. ప్రకంపనల తీవ్రతకు తొలుత సునామీ హెచ్చరికలను జారీ చేశారు. కానీ, తర్వాత ఉపసంహరించుకున్నారు.


ముందు జాగ్రత్తగా కొన్ని వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపం వల్ల పలు భవనాలు దెబ్బతిన్నాయి. యాభై మందికి పైగా గాయపడ్డారు. ప్రాణనష్టం గురించిన సమాచారం ఏమీ లేదు. కానీ, కుమామోటో నగరంలోని అయాన్‌ మాల్‌ అనే షాపింగ్‌ మాల్‌ పాక్షికంగా కూలిపోయి అందులో పలువురు చిక్కుకుపోయారు. వారిలో కొంతమంది చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మాల్‌లో పేలుడు కూడా సంభవించిందని అధికారులు తెలిపారు.

Updated Date - Jul 29 , 2026 | 08:20 AM