Share News

‘ఇస్రో’ను నామమాత్రం చేస్తారా?

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:10 AM

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగులు తొలిసారి అసంతృప్తి గళమెత్తారు. వాస్తవానికి ఆరేళ్ల కిందటే అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ప్రారంభమయ్యాయి...

‘ఇస్రో’ను నామమాత్రం చేస్తారా?

  • మొత్తం ప్రైవేటుకే ధారాదత్తమా?

  • తొలిసారి ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి

బెంగళూరు, సెప్టెంబరు 5: ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగులు తొలిసారి అసంతృప్తి గళమెత్తారు. వాస్తవానికి ఆరేళ్ల కిందటే అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ప్రారంభమయ్యాయి. అయితే.. ఇటీవల ఇస్రోలోని స్పేస్‌ ప్రమోషన్‌ విభాగం చైర్మన్‌ పవన్‌ గోయెంకా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇకపై ఎలాంటి ప్రయోగ వాహక నౌకలను రూపొందించం.’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 9ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం లేఖ రాశాయి. ప్రైవేటు భాగస్వామ్యం విషయంలో తాము వ్యతిరేకం కాదని, కానీ, ఇది నిర్దిష్ట వాణిజ్య కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావాలని సూచించాయి. ప్రయోగవాహక నౌకలను తయారు చేయకూడదన్న నిర్ణయం ఇస్రోను నామమాత్రం చేసి.. ఆర్‌ అండ్‌ డీకి పరిమితం చేయాలని భావిస్తున్నట్టుగా ఉందని లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. భవిష్యత్తులో అంతరిక్ష కార్యకలాపాలు ఇస్రో పరిధిలోనే ఉంటాయో లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 06:10 AM