రైల్లో అదనపు లగేజీకి ప్రీ బుకింగ్
ABN , Publish Date - Aug 01 , 2026 | 05:45 AM
రైలు ప్రయాణికులకు ఉచితంగా అనుమతించే లగేజీ కన్నా అదనంగా తీసుకెళ్లే లగేజీని ముందే బుక్ చేసుకునేలా భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అదనపు లగేజీ...
ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రైల్వే
కోల్‌కతా, జూలై 31: రైలు ప్రయాణికులకు ఉచితంగా అనుమతించే లగేజీ కన్నా అదనంగా తీసుకెళ్లే లగేజీని ముందే బుక్ చేసుకునేలా భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అదనపు లగేజీ బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ సేవల్ని శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అదనపు లగేజీని తీసుకుని వెళ్లేవారు డిపార్చర్‌కు ముందు రైల్వే పార్సెల్ ఆఫీసులో దానిని బుక్ చేసుకోవాల్సి వస్తోంది. దీని వల్ల అనసరపు పేపర్ ఖర్చు, ప్రయాణికుల సమయం వృఽథాతో పాటు స్టేషన్లలో రద్దీ నెలకొంటోంది. వీటికి చెక్ చెప్పే లక్ష్యంతో జూలై 31 నుంచి రైల్వే ఈ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని తెచ్చింది. ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నవారు తమ కన్ఫర్మ్ టికెట్‌తో జ్ట్టిఞ://ఠీఠీఠీ.ఞ్చట ఛ్ఛిజూ.జీుఽఛీజ్చీుఽట్చజీజూ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో అదనపు లగేజీని సులువుగా బుక్ చేసుకోవచ్చు. ప్రయాణం వివరాలను, లగేజీ వివరాలను ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ లగేజీకి ఎంత చార్జి అవుతుందో ఆ వెబ్ పోర్టల్ అంచనా వేసి చెబుతుంది. దీనిని ప్రింట్ తీసుకుని లగేజీతో పాటు ప్రయాణికులు పార్సెల్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మళ్లీ తూకాన్ని సరిచూసి చార్జీ తుది నిర్ధారణ చేస్తారు. డబ్బులు చెల్లించిన తర్వాత రశీదు ఇస్తారు. ఈ రశీదుతో గమ్యస్థానంలో దిగిన తర్వాత ప్రయాణికులు తమ లగేజీని తీసుకోవచ్చు. ట్రాక్ అండ్ ట్రేస్ సర్వీస్ ద్వారా లగేజీని రియల్ టైంలో చెక్ చేసుకోవచ్చు. గమ్యస్థానానికి చేరిన తర్వాత ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్ కూడా పంపిస్తారు. సాధారణ పార్సెల్ బుకింగ్ కంటే ఈ అదనపు లగేజీకి 1.5 రెట్ల ఎక్కువగా చార్జీ ఉంటుంది. కనీస చార్జీ రూ. 30తో మొదలవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News