ఇరాన్‌కు వెళ్లేవారికి భారత్ తాజా హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలని సూచన..
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:14 PM
ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, అత్యవసరమైతే తప్ప అక్కడకు వెళ్లవద్దని భారత పౌరులకు టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.
ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, అత్యవసరమైతే తప్ప అక్కడకు వెళ్లవద్దని భారత పౌరులకు టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ సూచించింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రకటనతో అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎంబసీ తమ అడ్వైజరీని సవరించి తాజా సూచనలు చేసింది (India Iran travel advisory).
ఇటీవలి సానుకూల పరిణామాల నేపథ్యంలో ప్రయాణ సూచనలను సవరించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అయినప్పటికీ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇరాన్‌కు అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారతీయులకు సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు లేదా తప్పనిసరిగా అక్కడికి వెళ్లాల్సిన వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది (Indian Embassy Tehran).
స్థానిక పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఆదేశాలను పాటించాలని రాయబార కార్యాలయం పేర్కొంది (Iran travel warning). ఇరాన్‌లో ఉన్న భారతీయులు తమ వివరాలను భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, తాజా సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ ఉండాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు..