Share News

భారత భూభాగాన్ని అమెరికా అడగలేదు

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:29 AM

ఇరాన్‌పై యుద్ధ అవసరాలకు భారత భూభాగాలను అమెరికా అడిగినట్టు వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. అవి నిరాధార కథనాలంటూ...

భారత భూభాగాన్ని అమెరికా అడగలేదు

  • యుద్ధ అవసరాలకు కోరిందనేది అబద్ధం: విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ, మార్చి 21 : ఇరాన్‌పై యుద్ధ అవసరాలకు భారత భూభాగాలను అమెరికా అడిగినట్టు వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. అవి నిరాధార కథనాలంటూ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అవసరమైనప్పుడు మిలిటరీ సౌకర్యాలను పరస్పరం వినియోగించుకునేలా 2016లో భారత్‌, అమెరికా మధ్య అవగాహన కుదిరింది. యుద్ధ విమానాలు చమురు నింపుకొనేందుకు వీలు కల్పించడం, వాటి మరమ్మతులకు సహకరించడం వంటి రవాణా సంబంధ అంశాలు ఈ ఒప్పంద(లాజిస్టిక్స్‌ ఎక్స్ఛేంజ్‌ మెమోరండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ - ఎల్‌ఈఎమ్‌వోఏ) పరిధిలోకి వస్తాయి. ఈ ఒప్పందం ప్రకారమే మనదేశంలోని పశ్చిమ భూభాగాలను యుద్ధ అవసరాలకు అమెరికా కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల శ్రీలంక సముద్ర జలాల్లో ఇరాన్‌ యుద్ధ నౌకను అమెరికా కూల్చివేసింది. ఈ దాడిని భారత భూభాగం నుంచే అమెరికా జరిపినట్టు కూడా కథనాలు వచ్చాయి. దీనిపై స్పష్టతను ఇస్తూ విదేశాంగ శాఖ ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ‘‘అమెరికాతో ఒప్పందం పరస్పరం మిలిటరీ వసతులను ఉపయోగించుకునేందుకు మాత్రమే’’ అని స్పష్టం చేసింది. శ్రీలంక జలాల్లో జరిగిన దాడులతో భారత్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 06:29 AM