Share News

రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..

ABN , Publish Date - Nov 01 , 2026 | 08:21 PM

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కాలేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ నేతలు చెప్పారని, అందులో సగం మంది కూడా రాలేదని బీజేపీ పేర్కొంది.

రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..
Rahul Gandhi, Sambit Patra,

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కాలేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ నేతలు చెప్పారని, అందులో సగం మంది కూడా రాలేదని బీజేపీ పేర్కొంది. సభా ప్రాంగణానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను విడుదల చేసింది. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు (INDIA Bloc Rally).


ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై నిరసనగా ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇండియా కూటమిలోని పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సభకు 10 లక్షల మందికి పైగా వస్తారని కాంగ్రెస్ నేతలు కే.సి. వేణుగోపాల్, పవన్ ఖేరా వంటి వారు అంచనా వేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీల సంఖ్యను ప్రస్తావిస్తూ సంబిత్ పాత్ర కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 28 వేల కుర్చీల్లో 5 వేల నుంచి 7 వేల వరకు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.


రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఖాళీ కుర్చీలు కనిపించాయని, భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పటికైనా నిజమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మైదానంలో దాదాపు 15 శాతం స్థలాన్ని వేదిక, దాని ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతం ఆక్రమించాయని, మిగిలిన ప్రదేశంలో సుమారు 40 శాతం ఖాళీగా ఉందని ఆయన చెప్పారు. కాగా, ఈ సభకు కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవ్వండి.. రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు..


ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తొలి జాబితా విడుదలైన మరుసటి రోజే ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా..

Updated Date - Nov 01 , 2026 | 08:21 PM