టాప్-5లో చోటు.. భారత రక్షణ రంగం ఖర్చు ఎంతో తెలుసా..
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:14 PM
ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. స్వీడన్‌కు చెందిన స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత రక్షణ ఖర్చులు గతేడాది గణనీయంగా పెరిగాయి.
ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. స్వీడన్‌కు చెందిన స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత రక్షణ ఖర్చులు గతేడాది గణనీయంగా పెరిగాయి. 2025 సంవత్సరంలో రక్షణ రంగంపై భారత్ సుమారు 92 బిలియన్ డాలర్లు (దాదాపు 8.6 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేసింది (India military spending 2026).
2024తో పోలిస్తే 2025లో భారత రక్షణ రంగ వ్యయం 8.9 శాతం పెరిగిందని సిప్రీ రిపోర్ట్ పేర్కొంది. ప్రపంచం మొత్తంలోని సైనిక వ్యయంలో భారత్ వాటా 3.2 శాతం. కాగా, సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచంలో రక్షణ రంగం కోసం అత్యధికంగా ఖర్చు పెట్టే తొలి దేశం అమెరికా. అగ్రరాజ్యం గతేడాది రక్షణ రంగంపై 954 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.87.8 లక్షల కోట్లు) ఖర్చు చేసింది (SIPRI report India rank).
ఇక ఈ జాబితాలో, 336 బిలియన్ డాలర్ల (రూ.31.6 లక్షల కోట్లు) ఖర్చుతో చైనా రెండో స్థానంలోనూ, 190 బిలియన్ డాలర్ల (రూ.17.9 లక్షల కోట్లు) ఖర్చుతో రష్యా మూడో స్థానంలోనూ, 114 బిలియన్ డాలర్ల (రూ.10.7 లక్షల కోట్లు) ఖర్చుతో జర్మనీ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. కాగా టాప్-5 జాబితాలో ఉన్న ఐదు దేశాల వ్యయం ప్రపంచ రక్షణ రంగం ఖర్చులో 58% వాటా కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది (Global defence spending list).
కాగా, పాకిస్థాన్ కూడా గతేడాది తన రక్షణ బడ్జెట్‌ను పెంచింది (World military expenditure). గతేడాది పాక్ రక్షణ వ్యయం 11 బిలియన్ డాలర్లు (రూ.1.03 లక్షల కోట్లు)గా ఉంది. 2024తో పోల్చుకుంటే 2025లో పాక్ రక్షణ వ్యయం 11 శాతం పెరిగింది. కాగా, సిప్రీ విడుదల చేసిన జాబితాలో పాక్ 31వ స్థానంలో ఉంది. గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ కారణంగానే భారత్, పాక్ రక్షణ వ్యయాలు భారీగా పెరిగాయి.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..