Share News

స్టాలిన్‌కు అధికారం ఉంటే.. నా సభ జరిగేది కాదు

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:04 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తిరునల్వేలిలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో టీవీకే చీఫ్ విజయ్ పాల్గొన్నారు. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు 'పూర్తి అధికారాలు' ఉంటే ఈరోజు తిరునల్వేలిలో ఈ సభ జరిగుండేది కాదని అన్నారు.

స్టాలిన్‌కు అధికారం ఉంటే.. నా సభ  జరిగేది కాదు
Vijay

తిరునల్వేలి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తిరునల్వేలిలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో టీవీకే చీఫ్ విజయ్ (Vijay) పాల్గొన్నారు. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు 'పూర్తి అధికారాలు' ఉంటే ఈరోజు తిరునల్వేలిలో ఈ సభ జరిగి ఉండేది కాదని అన్నారు.


'సీఎం ఏదో రకమైన అడ్డంకులు సృష్టించి మేము ఇక్కడకు రాకుండా నిరోధించే వారు. కానీ, ఇప్పుడున్నది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆయన ఎలాంటి అధికారులు లేని సీఎం' అని విజయ్ అన్నారు. డీఎంకే కూటమిని 'క్యాష్-బాక్స్ అలయెన్స్'గా ఆయన అభివర్ణించారు. భాగస్వామ్య పార్టీల్లో ఐక్యత లేదని, కనీసం ఒకరికొకరు ఓటు కూడా వేసుకోరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. తమిళనాడు కాంగ్రెస్‌కు డీఎంకే కోట్లాది రూపాయలు ఇస్తోందని ఆరోపించారు. అయితే నిజమైన కాంగ్రెస్ మాత్రం టీవీకే వైపే ఉందని చెప్పారు. ఈ ఎన్నికల ప్రాధాన్యతను వివరిస్తూ, ఇతర పార్టీలకు ఇవి కేవలం ఎన్నికలే కావచ్చని, టీవీకేకు మాత్రం ఈ ఎన్నికలు ఒక ఎమోషన్ అని తెలిపారు.


కాగా, తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలెయెన్స్‌కూ, అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మధ్య ఉండగా, టీవీకేతో విజయ్ తొలిసారి ఎన్నికల్లో దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఈనెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

బెంగాల్ ఎన్నికలు... మమతా బెనర్జీ నామినేషన్

గోవాలోని పోండా ఉపఎన్నిక రద్దు... ఈసీ నోటీఫికేషన్ చెల్లదని ప్రకటించిన హైకోర్టు

Updated Date - Apr 08 , 2026 | 06:08 PM