కారులో సీట్ల కింద 60 కిలోల గంజాయి!
ABN , Publish Date - Nov 08 , 2026 | 12:58 AM
కారులో ఒడిసా నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారు. కారులో వెనక సీట్ల కింద చిన్న ప్యాకెట్లలో అమర్చిన రూ.30 లక్షల విలువైన 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి..
ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు.. 60 లక్షల సరుకు స్వాధీనం
హైదరాబాద్ సిటీ/ఘట్‌కేసర్ రూరల్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): కారులో ఒడిసా నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారు. కారులో వెనక సీట్ల కింద చిన్న ప్యాకెట్లలో అమర్చిన రూ.30 లక్షల విలువైన 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌వోటీ, పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారని శనివారం ఎల్‌బీ నగర్ డీసీపీ అనూరాధ మీడియాకు వివరించారు.
హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ అమీర్, మహమ్మద్ ఇమ్రానుద్దీన్ డబ్బు సంపాదనే లక్ష్యంగా గంజాయి స్మగ్లర్ల అవతారమెత్తారు. ముంబయి స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒడిశాలో పూర్ణచంద్ర మహాపాత్ర అలియాస్ శివ వద్ద కిలో రూ.7 వేలకు చొప్పున 60 కిలోలు కొని హైదరాబాద్ మీదుగా ముంబైకి సరఫరా చేస్తున్నారు. అక్కడ రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. పోలీసులు ఘట్‌కేసర్ సమీపంలో వరంగల్‌హైవేపై కాపు కాసి స్మగ్లర్ల కారును అడ్డగించి పట్టుకున్నారు. ఇప్పటికే అమీర్‌పై 5, ఇమ్రానుద్దీన్‌పై 4 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..