లోక్‌సభ వేదికగా మావోయిస్టులకు అమిత్ షా వార్నింగ్
ABN , Publish Date - Mar 30 , 2026 | 06:22 PM
నక్సలిజం నిర్మూలనపై లోక్ సభలో చర్చ మెుదలైంది. మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని అమిత్ షా హెచ్చరించారు.
ఢిల్లీ: నక్సలిజం నిర్మూలనపై లోక్‌సభలో చర్చ మెుదలైంది. మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు. మావోయిస్టుల ఏరివేతకు రేపే(మార్చి 31) డెడ్ లైన్ అని తెలిపారు. బస్తర్‌లో ప్రస్తుతం మావోలు లేరని.. మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని వెల్లడించారు. బస్తర్‌లో ఆదివాసీలకు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధి దిశగా బస్తర్ ప్రాంతం ముందుకెళ్తోందని తెలిపారు.
మావోల లొంగుబాటుకు రేపే(మంగళవారం) ఆఖరి తేదీ అని.. అభివృద్ధి లేదంటూ ఆయుధాలు పట్టుకోవడం సరికాదని హితవుపలికారు అమిత్ షా. ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో విలీన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని.. కాంగ్రెస్ పాలనలోనే గిరిజన ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. వారి పాలనలో బస్తర్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని.. గిరిజనులను 60 ఏళ్లపాటు కాంగ్రెస్ విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నిర్వాకం వల్లే దేశంలో మావోయిజం పెరిగిందని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు.
మావోయిజం వల్ల 12 రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందని అమిత్ షా ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తమ వల్లే నక్సల్స్ విముక్త భారత్ సాధ్యమవుతోందని లోక్‌సభ వేదికగా కేంద్ర మంత్రి ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. బీజేపీ కొత్త సీఎం ఎంపికకు కసరత్తు
ఎమ్మెల్యే పదవికి నితిన్ నబీన్ రాజీనామా