Share News

ప్రాణాలు కాపాడమని వేడుకున్నా పట్టించుకోలేదు.. 40 నిమిషాల నిరీక్షణ చివరికి విషాదం

ABN , Publish Date - Jul 15 , 2026 | 08:30 PM

తీవ్ర గాయంతో రక్తం కారుతున్న తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ప్రాధేయపడ్డాడు. ఒకటి రెండు కాదు.. దాదాపు 40 నిమిషాల పాటు వాళ్లను వేడుకున్నాడు. కానీ పోలీసులు కనికరించలేదు. చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు వదిలాడు.

ప్రాణాలు కాపాడమని వేడుకున్నా పట్టించుకోలేదు.. 40 నిమిషాల నిరీక్షణ చివరికి విషాదం

లక్నో, జులై 15: తీవ్ర గాయంతో రక్తం కారుతున్న తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ప్రాధేయపడ్డాడు. ఒకటి రెండు కాదు.. దాదాపు 40 నిమిషాల పాటు వాళ్లను వేడుకున్నాడు. కానీ పోలీసులు కనికరించలేదు. చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీకి కూతవేటు దూరంలోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన కుమార్ ఘజియాబాద్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతడు ఆటోలో ప్రయాణించాడు. అందుకు రూ.20 చెల్లించే విషయంలో డ్రైవర్‌, కుమార్‌ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.


Pink-police-Station.jpgదీంతో వారు స్థానిక పింక్ పోలీస్ స్టేషన్‌ చేరుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరు మద్యం సేవించి ఉన్నారు. దీంతో భయపడిన మహిళా పోలీసులు స్టేషన్ తలుపులు మూసివేశారు. పోలీస్ స్టేషన్ తలుపును కుమార్ బలంగా కొట్టాడు. తలుపునకు ఉన్న అద్దం పగిలి.. కుమార్ చేతికి బలంగా గాయం అయింది. దీంతో తీవ్ర రక్త స్రావం అయింది. తనను రక్షించాలంటూ అతడు అరిచి అరిచి.. చివరకు కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు వెంటనే పోలీస్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించారు.


ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు అర గంట తర్వాత కుమార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వచ్చింది. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగి 72 గంటలు దాటినా ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని మృతుడు తల్లి ఆరోపించారు. తన కుమారుడు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తోంది. అతడిని కాపాడడానికి పోలీసులతోపాటు ఎవరూ ముందుకు రాలేదని వాపోయింది. కుమార్ భార్య ప్రస్తుతం 8 నెలల గర్భవతి అని వివరించింది. గత రెండేళ్లుగా అతడి తండ్రి కోమాలో ఉన్నారని తెలిపింది. కుమార్‌కు మానసిక వికలాంగుడైన సోదరుడు కూడా ఉన్నాడని ఆమె పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్‌లు.. దేశంలో తొలిసారిగా..

విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్‌

For More National News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 09:04 PM