Share News

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా.. కేంద్రం స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Jun 18 , 2026 | 08:00 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే తాజాగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా.. కేంద్రం స్పందన ఏంటంటే..
fuel price cut India

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే తాజాగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. హోర్ముజ్ నుంచి చమురు సరఫరాకు మార్గం సుగమం అయింది. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగి వచ్చాయి. మరి, దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? (Fuel price cut India)


దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా అనే ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ సమాధానమిచ్చారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ.. వెంటనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ముడి చమురు ధరల ధోరణి, సరఫరా పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాతే ఇంధన ధరలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు (Fuel price reduction).


ఇక, ధరల తగ్గింపు విషయంపై పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ కూడా తాజాగా స్పందించారు ( India fuel prices). హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకున్నప్పటికీ, తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్‌కు వచ్చేందుకు సమయం పడుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలోని చమురు కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయన్నారు. అలాగే చమురుపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా కేంద్రం రూ.12 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు. ఈ నేపథ్యంలో ధరల తగ్గింపు వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు.


ఇవి కూడా చదవండి..

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం


ఈపీఎఫ్‌ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..

Updated Date - Jun 18 , 2026 | 08:00 PM