అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ ఫిక్స్.. మెంబర్‌షిప్ పైనా ఆఫర్..
ABN , Publish Date - Jun 18 , 2026 | 07:09 PM
ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే-2026 సేల్ తేదీలు వచ్చేశాయి. అమెజాన్ తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక సేల్‌ను జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనుంది.
ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే-2026 సేల్ తేదీలు వచ్చేశాయి. అమెజాన్ తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక సేల్‌ను జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనుంది. కేవలం ప్రైమ్ యూజర్ల కోసమే ప్రతి ఏటా నిర్వహించే ఈ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులోకి రానున్నాయి (Amazon Prime Day 2026).
ఈ ప్రైమ్ సేల్‌లోని ఆఫర్ల వివరాలను అమెజాన్ ఇంకా ప్రకటించలేదు. సేల్‌కు కొన్ని రోజుల ముందు ఆఫర్ల వివరాలు బయటకు వస్తాయి. జులై 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఈ సేల్‌లో ప్రధానంగా శాంసంగ్, వన్ ప్లస్ బ్రాండ్లకు సంబంధించిన 500 ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్లకు అదనంగా పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు 5 శాతం డిస్కౌంట్ లభించనుంది (Amazon sale July 2026).
ఇక, ప్రైమ్ డే సేల్ సందర్భంగా కొత్తగా మెంబర్‌షిప్ తీసుకునేవారి కోసం బంపరాఫర్ ప్రకటించింది (Prime Day offers). స్టాండర్డ్ మెంబర్‌షిప్ ఏడాది ప్లాన్ ధరను రూ.1499 నుంచి రూ.999కి తగ్గించింది. అలాగే ప్రైమ్ లైట్ సబ్‌స్ర్కిప్షన్‌ను రూ.799 నుంచి రూ.599కి తగ్గించింది. ఇక, కేవలం షాపింగ్ డిస్కౌంట్‌ల కోసం మాత్రమే ఉపయోగపడే ప్లాన్‌ను రూ.399నుంచి రూ.299కి తగ్గించింది.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..