Share News

పాన్‌మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌కు స్వస్తి.. ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కీలక నిబంధనలు..

ABN , Publish Date - Aug 11 , 2026 | 08:48 PM

పాన్ మసాలా తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

పాన్‌మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌కు స్వస్తి.. ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కీలక నిబంధనలు..
Pan Masala Plastic Ban

ఇంటర్నెట్ డెస్క్: పాన్ మసాలా తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై పాన్ మసాలాను ప్లాస్టిక్ ఆధారిత ప్యాకెట్లలో ప్యాక్ చేయడానికి వీలుండదు (Pan Masala Plastic Ban).


కొత్త నిబంధనల ప్రకారం పాన్ మసాలాను ప్యాక్ చేసేందుకు పేపర్, పేపర్‌బోర్డ్, సెల్యులోజ్ లేదా ఇతర సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించవచ్చు. అయితే వీటిలో ఎలాంటి ప్లాస్టిక్ ఉండకూడదు. అలాగే పాలిథిలిన్, పాలీప్రొపైలిన్, పాలిస్టర్, పీవీసీ వంటి సింథటిక్ పాలిమర్లు, కో-పాలిమర్లు, లామినేట్లు కూడా అనుమతించరు. అలాగే పాన్ మసాలా ప్యాకెట్లలో సాధారణంగా ఉపయోగించే అల్యూమినియం ఫాయిల్, మెటలైజ్డ్ లేయర్లను కూడా కొత్త నిబంధనల ప్రకారం ఉపయోగించడానికి వీల్లేదు (FSSAI Pan Masala Rules 2026).


ప్రస్తుతం ఉన్న బహుళ పొరల ప్లాస్టిక్ ప్యాకెట్ల స్థానంలో కొత్త రకం ప్యాకేజింగ్‌ను తయారీదారులు ఉపయోగించాల్సి ఉంటుంది (Pan Masala Packaging Ban). పాన్ మసాలా తయారీదారులకు ప్రత్యామ్నాయంగా టిన్ లేదా గ్లాస్ కంటైనర్లను కూడా ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ అనుమతించింది. అంటే పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్రధానంగా మూడు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ప్లాస్టిక్ లేని పేపర్ ఆధారిత పదార్థాలు, టిన్ కంటైనర్లు లేదా గ్లాస్ కంటైనర్లు ఉపయోగించవచ్చు.


ఇవి కూడా చదవండి..

దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్‌ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..


అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..

Updated Date - Aug 11 , 2026 | 08:52 PM