ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:22 PM
కారు రివర్స్ చేస్తుండగా.. మరో కారు దానిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
లక్నో, జూన్ 29: రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సహారన్‌పూర్‌లోని జరిగింది. రాంపూర్ - మణిహరన్ ప్రాంతంలో డెహ్రూడూన్ - పంచ్‌కులా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వారిని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం సహారన్‌పూర్ ప్రభుత్వాసుపత్రికి పంపారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై జాతీయ రహదారిపై ఉన్న సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఈ రహదారిపై టాటా టియాగో కారు రివర్స్ చేసుకుంటుంది. అదే సమయంలో వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన బొలెరో కారు ఢీ కొట్టిందని పోలీసులు వివరించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని తెలిపారు.
వీరంతా హర్యానాలోని సోనిపత్ జిల్లాలోని బహదూర్‌గఢ్ నివాసులని చెప్పారు. హరిద్వార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అతి వేగంతోపాటు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. దీంతో కారు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం శుక్రవారం జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహయక చర్యలు..
అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక శుభాకాంక్షలు
For More National News And Telugu News