Share News

అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహయక చర్యలు..

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:01 AM

నోయిడా సెక్టర్ 119 అరణ్య సొసైటీలో భారీ అపార్ట్‌మెంట్‌లోని 21వ అంతస్తులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు ఎగసి పడ్డడంతోపాటు దట్టమైన పొగ వ్యాపించింది.

అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం..  కొనసాగుతున్న సహయక చర్యలు..

నోయిడా, జూన్ 29: నోయిడా సెక్టర్ 119 అరణ్య సొసైటీలో భారీ అపార్ట్‌మెంట్‌లోని 21వ అంతస్తులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు ఎగసి పడ్డడంతోపాటు దట్టమైన పొగ వ్యాపించింది. ఈ మంటలు అపార్ట్‌మెంట్‌లోని పలు నివాసాలకు వ్యాపించాయి. దాంతో అందులో నివసిస్తున్న వాసులు భయాందోళన గురయ్యారు. వారంతా అపార్ట్‌‌మెంట్లు మెట్ల ద్వారా కిందకి భయంతో పరుగులు తీశారు.


ఈ ప్రమాదంపై అగ్నిమాపక శాఖతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆరు అగ్నిమాపక శకటాలతో వారంతా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏసీ యూనిట్‌లో పేలుడు కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.


ఈ అగ్ని ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావడంతోపాటు సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారు ఎవరైనా ఉంటే.. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో పలువురు ఉన్నతాధికారుల బృందం నోయిడాలోని అరణ్య సొసైటీకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

Updated Date - Jun 29 , 2026 | 11:53 AM