Share News

భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినందుకే తొలగించారు: ఏఐ ఉద్యోగులు

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:07 PM

ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాల గురించి హెచ్చరించనందువల్లే చాట్ జీపీటీ మేకర్ తమను తొలగించిందని ముగ్గురు ఓపెన్ ఏఐ సెక్యూరిటీ మాజీ పరిశోధకులు ఆరోపించారు. భద్రతకు తాము ప్రాధాన్యం ఇచ్చినందువల్లే కంపెనీ తమను టర్మినేట్ చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినందుకే తొలగించారు: ఏఐ ఉద్యోగులు

ఇంటర్‌నెట్ డెస్క్: ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాల గురించి హెచ్చరించనందువల్లే చాట్ జీపీటీ మేకర్ తమను తొలగించిందని ముగ్గురు ఓపెన్ ఏఐ సెక్యూరిటీ మాజీ పరిశోధకులు ఆరోపించారు. భద్రతకు తాము ప్రాధాన్యం ఇచ్చినందువల్లే కంపెనీ తమను టర్మినేట్ చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఓపెన్ ఏఐ ప్రయోజనాల కన్నా భద్రతకే మేము ప్రాధాన్యం ఇచ్చాం. అదే మేము చేసిన తప్పు. కంపెనీ నుంచి మమ్మల్ని తీసేయడంతో చాలా ఆందోళన చెందాం. ఈ పరిణామంతో ఓపెన్ ఏఐలో నార్మ్స్ చాలా వేగంగా మారుతున్నాయని మాకు తెలిసింది’’ అని మికితా బాలెస్ని ‘ఎక్స్’ లో తెలిపారు. బాలెస్నితో పాటు తొలగింపునకు గురైన మరో ఇద్దరు ఉద్యోగులు టోమెక్ కోర్బాక్, జాస్మిన్ వాంగ్ గురువారం ఈ మేరకు ఓపెన్ ఏఐకు లెటర్ రాశారు. ‘‘మమ్మల్ని అర్ధాంతరంగా, అకస్మాత్తుగా తొలగించారు. దీంతో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినంతమాత్రాన మమ్మల్ని అప్పటికపుడే ఎలా ఇంటికి పంపుతారు. ఇండిపెండెంట్ ఆడిటర్లను శాశ్వతంగా పెట్టుకుంటామని కంపెనీ ఇంతకుముందు మాట ఇచ్చింది. ఆ హామీని కంపెనీ నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా మమ్మల్ని తొలగించినందుకు కంపెనీ సాకులు వెతుక్కుంటుందని మాకు ఆందోళనగా ఉంది’’ అని ఆ ఉత్తరంలో మాజీ ఉద్యోగులు పేర్కొన్నారు.


వారు చెప్పేది అబద్ధం

కంపెనీ నుంచి ఉద్వాసనకు గురైన ఉద్యోగులు రాసిన ఉత్తరంపై ఓపెన్ ఏఐ స్పందించింది. వారు చెప్పేది అబద్ధమని పేర్కొంది. ఆ ఉద్యోగులు కంపెనీ నియమాలను ఉల్లంఘించినందుకు తొలగించామని, ఈ విషయం తాము జరిపిన దర్యా్ప్తులో తేలిందని ఓపెన్ ఏఐ వెల్లడించింది. కీలక సమాచారాన్ని వారు దుర్వినియోగం చేశారని, అందుకే వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. కంపెనీ పెట్టుకున్న నమ్మకాన్ని వారు వమ్ము చేశారని వ్యాఖ్యానించింది. భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినంతమాత్రాన ఉద్యోగులను తొలగించబోమని చెప్పింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో హైఅలర్ట్.. పర్యటనలు రద్దు చేసుకుని రంగంలోకి దిగిన అమిత్ షా

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న గొడ్డలి పార్టీ: మంత్రి సత్యప్రసాద్

Updated Date - Oct 09 , 2026 | 01:58 PM