నకిలీ లింక్‌లతో జాగ్రత్త.. చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచన
ABN , Publish Date - Aug 10 , 2026 | 02:21 PM
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌లు, మోసపూరిత మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌లు, మోసపూరిత మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా చందాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. పీఎఫ్ సేవలు పొందే సమయంలో వెబ్ లింక్‌లను పరిశీలించి.. వ్యక్తిగత వివరాలను భద్రంగా ఉంచుకోవాలని పేర్కొంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
పీఎఫ్ సేవల కోసం అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలి.
ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియా, ఈమెయిల్‌లో వచ్చే గుర్తు తెలియని లింక్‌లను క్లిక్ చేయొద్దు.
లాగిన్ చేసే ముందు వెబ్‌సైట్ మినహా ఇతర సైట్లలో యూఏఎన్, పీపీఓ, పాస్‌వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని నమోదు చేయొద్దు
లాగిన్ చేసే ముందు వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. అక్షరాల్లో స్వల్ప మార్పులు, అనుమానాస్పద డొమైన్ పేర్లు ఉన్నాయోమో చూడాలి.
అనుమానాస్పద వెబ్‌సైట్లు, మెసేజ్‌లు కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి
ఫోన్ కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఈమెయిల్ ద్వారా ఈపీఎఫ్ఓ ఎప్పుడూ ఓటీపీ, వ్యక్తిగత వివరాలు లేదా లాగిన్ సమాచారాన్ని అడగదని గుర్తుంచుకోవాలి.
లింక్ కనిపించిందని క్లిక్ చేయొద్దు..
డిజిటల్ విధానంలో పీఎఫ్ సేవలను వినియోగించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌లతో వినియోగదారులను మోసగించే అవకాశం ఉందని ఈపీఎఫ్‌వో పేర్కొంది. అధికారిక సైట్ నుంచే సేవలను పొందాలని సూచించింది. గుర్తుతెలియని సందేశాల్లో వచ్చే లింక్‌లను నమ్మకుండా.. ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్‌ను స్వయంగా వెరిఫై చేసి సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
మోదీని నవ్వించిన బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
రెస్టారెంట్‌లో భారత మ్యాప్‌పై లవ్లీనా అభ్యంతరం.. ఆమె చర్యను ప్రశంసించిన మోదీ