భోగాపురానికి గుడ్ న్యూస్
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:57 PM
భోగాపురం ఎయిర్ పోర్ట్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సంబంధిత పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 4న భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ, జనవరి 27: బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ భారత్‌లో విమానాల తయారీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. అందుకోసం అదానీ, ఎంబ్రాయర్‌ల మధ్య కీలక సహకార ఒప్పందం(Collaboration Agreement) కుదిరింది. ఈ ఒప్పందంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో తయారీ యూనిట్‌లను ఈ ఎంబ్రాయర్ సంస్థ నెలకొల్పనుంది.
దీంతో భోగాపురంలో ఎంబ్రాయర్ చేత యూనిట్ ఏర్పాటు చేయించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. భూమితో పాటు మౌలిక సదుపాయాలనూ కల్పిస్తామని ఎంబ్రాయర్‌కు ఏపీ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భోగాపురంలో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్(ఎంఆర్‌ఓ), ఏరోస్పేస్ క్లస్టర్లను సైతం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బ్రెజిల్‌కు చెందిన ఈ ఎంబ్రాయర్.. చిన్న, మధ్యస్థ ప్యాసింజర్ విమానాలతో పాటు సైనిక, ట్రాన్స్‌పోర్ట్ విమానాలనూ తయారు చేస్తోంది.
మరోవైపు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 4న ఈ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్ సహా పలువురు ఉన్నతాధికారులు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా వీరికి జిల్లా ఉన్నతాధికారులతో పాటు విమానయాన సంస్థ అధికారులు నాడు ఘన స్వాగతం పలికారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ఎయిర్‌పోర్ట్ పూర్తయిందని జీఎంఆర్ సంస్థ వెల్లడించింది. జూన్ 26న ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అఖిలపక్ష భేటీ
For More National News And Telugu News