Share News

అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3,717 కోట్ల విలువైన ముంబై నివాసం జప్తు

ABN , Publish Date - Feb 25 , 2026 | 08:02 PM

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని ఆయన విలాసవంతమైన నివాసం 'అబోడ్' ను తాత్కాలికంగా జప్తు చేసింది.

అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3,717 కోట్ల విలువైన ముంబై నివాసం జప్తు
Anil Ambani

ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని ఆయన విలాసవంతమైన నివాసం 'అబోడ్' (Abode)ను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ ఆస్తి విలువ రూ.3,716.83 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


పాలిహిల్ ప్రాంతంలో ఉన్న ఈ భవనం 66 మీటర్ల ఎత్తు, 17 అంతస్తులతో లగ్జరీ టవర్‌గా పేరుంది. అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) కోట్లాది రూపాయల మేర బ్యాంకు రుణాల మోసానికి పాల్పడిన కేసులో ఈ జప్తు జరిగింది. దీంతో ఈ కేసులో ఇంతవరకూ జప్తు చేసిన అనిల్ అంబానీ ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు చేరింది.


ఆర్‌సీఓఎం మోసపూరిత బ్యాంకింగ్ డీలింగ్స్‌తో ఈ తాజా ప్రాపర్టీకి సంబంధం ఉందని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. పీఎంఎల్ఏ కింద 2025 ఆగస్టులో అంబానీ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. త్వరలోనే మరోసారి ఆయనను ఈడీ ప్రశ్నించనుంది. అనిల్ అంబానీ ఆర్‌సీఓఎంపై తొలుత సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో దీనిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. గత జూలైలో 35కు పైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. గ్రూప్‌లోని 50 కంపెనీలకు చెందిన 25 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించింది.


ఇవి కూడా చదవండి..

న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీం సీరియస్

పాఠ్యాంశం తొలగిస్తాం.. సుప్రీం సీరియస్‌పై కేంద్రం

Updated Date - Feb 25 , 2026 | 09:02 PM