Share News

భారతరత్న సీఎన్‌ఆర్‌ రావుకు ఈసీ నోటీసులు

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:11 AM

బెంగళూరు వాసి, ప్రముఖ శాస్త్రవేత, భారతరత్న గ్రహీత సీఎన్‌ఆర్‌ రావు(92)కు ఈసీ నోటీసులు పంపించింది. ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా జారీ అయిన ఈ నోటీసులో... ‘‘పాత ఓటర్ల జాబితాలోని...

భారతరత్న సీఎన్‌ఆర్‌ రావుకు ఈసీ నోటీసులు

‘పేరు సరిపోలడం లేదు’ అంటూ ‘సర్‌’ విచారణకు పిలుపు

నోటీసు ఇచ్చామన్నది సత్యదూరం: ఈసీ

బెంగళూరు, సెప్టెంబరు 9: బెంగళూరు వాసి, ప్రముఖ శాస్త్రవేత, భారతరత్న గ్రహీత సీఎన్‌ఆర్‌ రావు(92)కు ఈసీ నోటీసులు పంపించింది. ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా జారీ అయిన ఈ నోటీసులో... ‘‘పాత ఓటర్ల జాబితాలోని పేరుకు, తాజా ఓటర్ల జాబితాలోని పేరుకు స్పెల్లింగ్‌లో తేడాలు ఉన్నాయి. ‘సెల్ఫ్‌ నేమ్‌ మిస్‌ మ్యాచ్‌’ కింద బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సె్‌స(ఐఐఎ్‌ససీ)కు సమీపంలోని మల్లేశ్వరంలో విచారణకు హాజరుకావాలి’’ అని పేర్కొన్నారు. పాత ఓటర్ల జాబితాలో ్కటౌజ.ఇ.ూ.ఖ.ఖ్చౌ అని ఉంటే కొత్త ఓటర్ల జాబితలో ్కటౌజజ.ఇ.ూ.ఖ.ఖ్చౌ అని ఉంది. టైటిల్‌లో ఒక ఎఫ్‌ అక్షరం అదనంగా పడడంతో ఈ నోటీసు జారీ అయింది. బెంగళూరు, బసవనగుడిలో పుట్టిన సీఎన్‌ఆర్‌ రావు అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి గడించిన శాస్త్రవేత్త. ఆయన ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకి శాస్త్రీయ సలహా మండలి సభ్యుడిగా సేవలు అందించారు. ఆ తరువాత మరో నలుగురు ప్రధాన మంత్రులు.... రాజీవ్‌ గాంధీ, హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌, మన్మోహన్‌ సింగ్‌ కాలంలో వారికి అనుబంధంగా ఉన్న శాస్త్రీయ సలహా మండళ్లకూ అధ్యక్షత వహించారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సె్‌సకు అధిపతిగా వ్యవహరించిన రావు... పద్మశ్రీ, పద్మ విభూషణ్‌, కర్ణాటక రత్న వంటి అత్యున్నత పురస్కారాలతోపాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయన సొంతం. సీవీ రామన్‌, ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ తరువాత 2014లో భారత రత్న అందుకున్న మూడవ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్‌ రావు. కాగా, సీఎన్‌ఆర్‌ రావుకు ఎలాంటి నోటీసులు పంపించలేదని ఎన్నికల సంఘం బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వాస్తవానికి 2002 ఓటర్ల జాబితాలో రావు పేరు రామ, s/o హెచ్‌.నగేశ్‌ అని ఉండగా... తాజా ఓటర్ల జాబితాలో s/o Proff.C.N.R.Rao S/O Nagesh Rav.H అని ఉందని ఈసీ వివరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 06:11 AM