Share News

Earthquake: అస్సామ్, త్రిపుర రాష్ట్రాల్లో భూప్రకంపనలు

ABN , Publish Date - Jan 05 , 2026 | 07:04 AM

ఈశాన్య రాష్ట్రంలో భూప్రకంపనలు సంభవించాయి. అస్సామ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్సీఎస్ పేర్కొంది.

Earthquake: అస్సామ్, త్రిపుర రాష్ట్రాల్లో భూప్రకంపనలు
Earthquake

ఇంటర్నెట్ డెస్క్: ఈశాన్య రాష్ట్రాలైన అస్సామ్, త్రిపురల్లో భూప్రకంపనలు సంభవించాయి(Earthquake in Assam). అస్సామ్‌లోని మోరిగావ్‌లో(Morigaon) సోమవారం తెల్లవారుజామున ఈ ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) తెలిపింది. సుమారు 50 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఏర్పడగా.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్టు పేర్కొంది.


మరోవైపు.. దాదాపు అదే సమయంలో త్రిపురలోనూ స్వల్ప భూకంపం సంభవించినట్టు ఎన్సీఎస్ వెల్లడించింది(Earthquake in Tripura). రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9గా నమోదైందని పేర్కొంది. గోమతి(Gomati) ప్రాంతంలో సుమారు 54 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు ఎక్స్‌లో స్పష్టం చేసింది. దీని ప్రభావంతో మేఘాలయ(Meghalaya) రాష్ట్రంలోనూ పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్టు సమాచారం.

అయితే.. ఈ ఘటనతో ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.


ఇవీ చదవండి:

ఆత్మగౌరవ పర్వం.. వెయ్యేళ్ల అఖండ విశ్వాసం

ఢిల్లీ వర్సిటీలో భోగి మంటలు, పిండి వంటలు

Updated Date - Jan 05 , 2026 | 07:52 AM