Share News

మద్యం మత్తులో తండ్రి దారుణం.. పదునైన ఆయుధంతో..

ABN , Publish Date - May 26 , 2026 | 08:39 AM

ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. పదునైన ఆయుధంతో అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఇంట్లో దాచిపెట్టాడు.

మద్యం మత్తులో తండ్రి దారుణం.. పదునైన ఆయుధంతో..

లఖింపూర్ ఖేరీ: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా ఇంట్లో దాచిపెట్టాడు. చివరికి విషయం పోలీసులకు తెలియడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


లఖింపూర్ ఖేరీ జిల్లా భవానీపూర్ గ్రామానికి చెందిన తండ్రీకుమారులు దయా రామ్, మునీశ్(30) మద్యం సేవించారు. పూటుగా మందు తాగి ఇంటికి వచ్చారు. అనంతరం కుటుంబానికి సంబంధించిన చిన్న విషయంలో వారి మధ్య వివాదం మొదలైంది. మాటల యుద్ధం కాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన మునీశ్ తన తండ్రిని తీవ్రంగా కొట్టాడు. అనంతరం దయా రామ్ కూడా మునీశ్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో చేతికి దొరికిన పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా పొడిచాడు.


తీవ్రగాయాలు కావడంతో మునీశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, హత్య విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు కుమారుడి మృతదేహాన్ని దయా రామ్ తన ఇంట్లో దాచిపెట్టాడు. అయినా గ్రామస్థులకు విషయం తెలిసింది. కొన్ని గంటల తర్వాత దయా రామ్ సోదరి ఫిర్యాదుతో భవానీపూర్ గ్రామానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, నిందితుడిని అరెస్టు చేశామని సీఐ రమేశ్ తివారీ తెలిపారు. మద్యం మత్తులోనే హత్య జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వార్నింగ్ ఇచ్చారు.. రెండు గంటల్లోనే అన్నదమ్ములను చంపేశారు..

సామాన్యుడిపై మరో భారం.. కిలోకు రూ.2 పెరిగిన సీఎన్‌జీ ధర..

Updated Date - May 26 , 2026 | 09:10 AM