వార్నింగ్ ఇచ్చారు.. రెండు గంటల్లోనే అన్నదమ్ములను చంపేశారు..
ABN , Publish Date - May 26 , 2026 | 07:34 AM
బిహార్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్‌కు వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన రెండు గంటల్లోనే ప్రత్యర్థి గ్యాంగ్‌లోని ఇద్దర్ని చంపేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: బిహార్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్‌కు వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన రెండు గంటల్లోనే ప్రత్యర్థి గ్యాంగ్‌లోని ఇద్దర్ని చంపేసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నవాడా జిల్లాలోని రెండు కుటుంబాల మధ్య గత ఆరు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు కుటుంబాల మీద పోలీసులు కేసులు పెట్టారు. ఓ గ్యాంగ్‌కు చెందిన ఫాహిమ్ మాలిక్ అనే వ్యక్తి బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశాడు.
సోమవారం ఆ బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో మాలిక్, అతడి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘రెండు రోజుల్లో మీ ఇంట్లో ఇద్దరిని చంపేస్తాం’ అని కోర్టు ఆవరణలోనే ప్రత్యర్థి గ్యాంగ్‌కు వార్నింగ్ ఇచ్చారు. కోర్టు నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో 22 ఏళ్ల మహ్మద్ కాసిఫ్, 21 ఏళ్ల మహ్మద్ అహ్మద్‌లపై ప్రత్యర్థి గ్యాంగ్ ఆయుధాలతో దాడి చేసింది. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో కాసిఫ్, అహ్మద్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాసిఫ్, అహ్మద్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. పోలీసు ఉన్నతాధికారులు గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సంఘటన జరిగిన రోజే ఓ నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు మిగిలిన నిందితులను అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
శాంతి చర్చల మధ్య ఇరాన్ బోట్లు, క్షిపణి కేంద్రాలపై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు
గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..