డీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్
ABN , Publish Date - May 30 , 2026 | 09:39 PM
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా మాజీ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ శనివారంనాడు అధికారింగా ఆహ్వానించారు.
బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా మాజీ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar)కు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్(Thaawarchand Gehlot) శనివారంనాడు అధికారికంగా ఆహ్వానించారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 4.05 గంటలకు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఒక లేఖను గవర్నర్‌కు శివకుమార్ సమర్పించారు. దీంతో శివకుమార్, ఆయన మంత్రిమండలి సభ్యులను ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించినట్టు రాజ్‌భవన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
దీనికి ముందు, విధాన సౌధలో జరిగిన సీఎల్‌పీ సమావేశంలో డీకే శివకుమార్ ఏకగ్రీవంగా సీఎల్‌పీ నేతగా ఎన్నికయ్యారు. డీకే పేరును పార్టీ అధిష్ఠానం సూచించగా, సీఎల్‌పీ సమావేశంలో తొలుత సిద్ధరామయ్య, ఆ తర్వాత డాక్టర్ జి.పరమేశ్వర ఆయన పేరును ప్రతిపాదించారు. దీనికి ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అధికారికంగా డీకే ఎన్నికను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. డీకే పాలనా పగ్గాలు చేపట్టనుండటంతో తక్కిన రెండేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే