Share News

సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

ABN , Publish Date - May 30 , 2026 | 05:10 PM

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కర్ణాటక అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ లిజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
DK Shivakumar

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కర్ణాటక అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ లిజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు సమర్ధించడంతో ఏకగ్రీవంగా డీకే ఎన్నిక జరిగింది. పార్టీ కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. సీఎల్పీ నేతగా డీకే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.


దీనికి ముందు సీఎల్‌పీ సమావేశానికి డీకే బయలుదేరినప్పుడు.. ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా ఈనెల 3న ప్రమాణస్వీకారం చేయనున్నారా అని మీడియా అడిగినప్పుడు 'థర్డ్ థర్డ్' అంటూ డీకే సమాధానమిచ్చారు. అనంతరం సీఎల్పీ సమావేశం కోసం విధాన సౌధకు చేరుకున్నారు. విధానసౌధ మెట్లకు నమ్మస్కారం చేసిన అనంతరం లోపలకు అడుగుపెట్టారు.


ఇవి కూడా చదవండి..

నలుగురు డిప్యూటీ సీఎంలకు డీకే విముఖత.. మంత్రివర్గంలో వీరికి ఛాన్స్

ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న 9 మంది అరెస్టు

Updated Date - May 30 , 2026 | 05:19 PM