Share News

ఉత్తరప్రదేశ్ నుంచి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తా: మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:42 AM

ఉత్తరప్రదేశ్ నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని, ప్రజలతో కలిసి పనిచేస్తానని ఆమె చెప్పారు. ప్రజల గొంతుకను అవుతానని తెలిపారు.

ఉత్తరప్రదేశ్ నుంచి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తా: మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని, ప్రజలతో కలిసి పనిచేస్తానని ఆమె చెప్పారు. ప్రజల గొంతుకను అవుతానని తెలిపారు. ఈ మేరకు దివ్య ఒక వీడియో విడుదల చేశారు. ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసిన నెల రోజుల తర్వాత మొదటిసారిగా ఆమె మాట్లాడారు. భవిష్యత్తులో తాను చేయబోయే పనుల గురించి వివరించారు. 2013 బ్యాచ్ యూపీ కేడర్‌కు చెందిన ఆమె.. గత నెల 30న రాజీనామా చేశారు. తర్వాత తాను ఏం చేయబోతున్నారన్న సస్పెన్స్‌కు తెర దించారు.


యూపీ ప్రజలు నన్ను కూతురిలా చూశారు

తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను ఏం చేస్తానోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారని దివ్య అన్నారు. ‘తర్వాత మీరేం చేస్తారని ప్రజలు నన్ను అడుగుతూనే ఉన్నారు. ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి నాకు కొంత టైం పట్టింది. యూపీ నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభించాలనుకుంటున్నా. ఎందుకంటే యూపీ నాకు వర్క్‌ప్లేస్ కన్నా ఎక్కువ. ఆ రాష్ట్ర ప్రజలు నన్ను ఒక కూతురిలా, తమ కుటుంబ సభ్యురాలిలా చూశారు. యూపీ చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి నుంచే నా రాజకీయ ప్రయాణం ప్రారంభించాలనుకున్నా’ అని దివ్య చెప్పారు.


రాజకీయాలంటే అధికారంలోకి వచ్చి పదవులు పొందడం కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించడమని దివ్యా మిట్టల్ అన్నారు. చాలా మంది సమస్యలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాలకు చేరని అలాంటి వారి తరపున తాను గళం ఎత్తుతానని ఆమె పేర్కొ్న్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: భారత మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్‌కు సిల్వర్

హైవోల్టేజ్ డ్రామా.. ఇలాంటి రనౌట్‌ ఎప్పుడూ చూడలేదు!

Updated Date - Sep 29 , 2026 | 12:08 PM