Share News

డీలిమిటేషన్ ఓటింగ్‌.. టీఎంసీ రెబల్ ఎంపీలకు అడ్డంకి లేనట్టేనా..

ABN , Publish Date - Nov 29 , 2026 | 08:01 PM

డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యామని ప్రకటించిన 20 మంది ఎంపీల ఓటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.

డీలిమిటేషన్ ఓటింగ్‌.. టీఎంసీ రెబల్ ఎంపీలకు అడ్డంకి లేనట్టేనా..
Delimitation Bill 2026

ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనమయ్యామని ప్రకటించిన 20 మంది ఎంపీల ఓటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనకుండా ఆ 20 మంది ఎంపీలను అడ్డుకోవాలని టీఎంసీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆ పార్టీ లోక్‌సభ నేత అభిషేక్ బెనర్జీ లేఖ రాశారు (Delimitation Bill 2026 NCPI MPs).


టీఎంసీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు ఈ ఏడాది జూన్ 14న స్పీకర్ ఓం బిర్లాను కలిసి తాము ఎన్‌సీపీఐలో విలీనమవుతున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. అయితే ఈ విలీనాన్ని టీఎంసీ అంగీకరించడం లేదు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఆ 20 మందిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ జూన్ 19న పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అభిషేక్ బెనర్జీ తన తాజా లేఖలో పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై తుది నిర్ణయం వెలువడే వరకు ఈ 20 మంది ఎంపీలను ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఓటింగ్‌కు అనుమతించకూడదని కోరారు. ఆ 20 మంది ఎంపీలకు లోక్‌సభలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించడాన్ని కూడా పునఃపరిశీలించాలని స్పీకర్‌ను కోరారు (Anti Defection Law).


లోక్‌సభ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికీ టీఎంసీ బలం 28 మంది ఎంపీలుగానే చూపిస్తోందని గుర్తుచేశారు (TMC Parliament Voting). విలీన ప్రక్రియపై నిర్ణయం రాకముందే ఈ ఎంపీల ఓట్లను పరిగణనలోకి తీసుకోకూడదని పేర్కొన్నారు. కాగా, ఈ 20 మంది ఎంపీల అనర్హత పిటిషన్లపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వీరికి ఓటింగ్ వేయడంలో ఇలాంటి ఇబ్బందులూ ఉండవని లోక్‌సభ వర్గాలు వెల్లడించాయి. ఈ 20 మంది తిరుగుబాటు టీఎంసీ ఎంపీలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని సంకేతాలు ఇవ్వడంతో వారి ఓట్లు అధికార పక్షానికి కీలకంగా మారాయి.


ఇవి కూడా చదవండి..

అమెరికా సైన్యంపై దాడులు.. ఇరాన్ స్టార్‌లింక్ వినియోగించిందా..


భూకంప సమయంలో విమానాన్ని టేకాఫ్ చేసిన పైలట్‌పై తండ్రి ప్రశంసలు.. అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 29 , 2026 | 08:08 PM