Share News

ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. జెట్ ఫ్యూయల్‌పై భారీగా వ్యాట్ తగ్గింపు

ABN , Publish Date - May 16 , 2026 | 09:13 PM

విమానయాన సంస్థలకు భారీ ఊరట కలిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై వ్యాట్‌ను భారీగా తగ్గించింది. ఏటీఎఫ్‌పై ప్రస్తుతం ఉన్న వ్యాట్‌ను 25 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది.

ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. జెట్ ఫ్యూయల్‌పై భారీగా వ్యాట్ తగ్గింపు
Jet Fuel

న్యూఢిల్లీ: విమానయాన సంస్థలకు భారీ ఊరట కలిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై వ్యాట్ (VAT)ను భారీగా తగ్గించింది. ఏటీఎఫ్‌పై ప్రస్తుతం ఉన్న వ్యాట్‌ను 25 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. విమానాలు నడిపేందుకు జెట్ ఇంజన్లలో ఏటీఎఫ్ వినియోగిస్తున్నారు. వ్యాట్ తగ్గింపునకు ఢిల్లీ సర్కార్ తాజా నిర్ణయంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాయాశ్రంలో ఇంధనం కొనుగోలు చేసే విమానయాన సంస్థలు తక్కువ ధరలను చెల్లించే వీలుంటుంది.


'ఏటీఎఫ్‌పై వ్యాట్‌ను 25 శాతం నంచి 7 శాతానికి తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఎయిర్‌లైన్స్‌కు, సాధారణ ప్రయాణికులకు లబ్ధి చేకూరుతుంది' అని ఒక అధికార ప్రకటన విడుదల చేశారు.


దీనికి ఒకరోజు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ఏటీఎఫ్‌పై వ్యాట్‌ను 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. మే 15వ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గ్లోబల్ క్రూడాయిల్ ధరల పెరుగుదల, సరఫరాలో అవాంతరాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. భారతీయ విమానాయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో సుమారు 35 నుంచి 45 శాతం జెట్ ఇంధనానికే ఖర్చవుతుంది. ఏటీఎఫ్‌పై వ్యాట్ తగ్గింపు నిర్ణయంతో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలకు ఒకింత ఊరట కలుగనుంది.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో రూ.5.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత.. నిందితుడి అరెస్ట్

పుష్ప బాధ్యత నాది... ఫాల్టా రీపోలింగ్‌ వేళ సీఎం సువేందు వార్నింగ్

Updated Date - May 16 , 2026 | 09:15 PM