Share News

యువకుడిపై చేయి చేసుకున్న ఢిల్లీ మంత్రి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:31 PM

ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యువకుడిపై చేయి చేసుకున్న ఢిల్లీ మంత్రి.. వీడియో వైరల్..
Parvesh Verma slaps man

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రహదారి పరిశీలనకు వెళ్లిన సమయంలో వీడియో తీస్తున్న ఓ యువకుడిని మంత్రి కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వైరల్ వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (Parvesh Verma slaps man).


పర్వేశ్ వర్మ రహదారి పరిశీలన కోసం వెళ్లిన సమయంలో ఓ యువకుడు తన మొబైల్ ఫోన్‌తో వీడియో తీస్తున్నాడు. ఈ సమయంలో మంత్రి తన ఎడమ చేతితో యువకుడి మొబైల్‌ను కిందకు లాగేశారు. అనంతరం కుడి చేతితో అతడి చెంపపై కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ యువకుడు మంత్రితో వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా భద్రతా సిబ్బంది వారిని విడదీశారు. ఘటన సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు (Delhi Minister viral video).


ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు (Parvesh Verma viral video). ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ పోస్టును పంచుకుని మంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యువకుడిని కొట్టిన మంత్రిపై ఆప్ కార్యకర్తలతో పాటు పలువురు నెటిజన్లు కూడా విమర్శలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఏవి పని చేయవు.. ఏవి పనిచేస్తాయంటే..


వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఆర్టీఐపై జారీ చేసిన కీలక ఉత్తర్వులు రద్దు..

Updated Date - Sep 27 , 2026 | 06:01 PM