భార్యతో అఫైర్ పెట్టుకున్న పొరుగింటి వ్యక్తిని చంపాడు.. 28 ఏళ్ల తర్వాత అరెస్టయ్యాడు..
ABN , Publish Date - Nov 01 , 2026 | 06:29 PM
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా వెలుగుచూసిన ఓ పాత హత్య కేసు చర్చనీయాంశంగా మారింది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో పొరుగింటి వ్యక్తిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు 28 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా వెలుగుచూసిన ఓ పాత హత్య కేసు చర్చనీయాంశంగా మారింది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో పొరుగింటి వ్యక్తిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు 28 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఈ నేరంలో నిందితుడు తన గుర్తింపును దాచుకుంటూ వివిధ ప్రాంతాల్లో నివసించాడు. చివరకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం అతడిని పట్టుకుంది (Delhi Murder Case).
ఈ ఘటన 1998 అక్టోబర్ 20న ఢిల్లీలోని గోకల్‌పురి ప్రాంతంలో జరిగింది. జై ప్రకాశ్ (24) అనే యువకుడు తీవ్ర గాయాలతో మరణించాడు. మొదట పోలీసులు దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. జై ప్రకాశ్‌ను అతడి పొరుగింట్లో ఉండే విశ్వనాథ్ సింగ్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సుత్తితో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జై ప్రకాశ్‌కు తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని విశ్వనాథ్ సింగ్ అనుమానించాడు. ఈ అనుమానమే హత్యకు కారణమని పోలీసు అధికారులకు తెలిసింది. అయితే నిందితుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. (1998 Murder Case).
విశ్వనాథ్ సింగ్ (62) గత 28 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు (Crime Branch Delhi). ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో అతడి స్వగ్రామాన్ని గుర్తించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అతడి కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా పెట్టారు. విశ్వనాథ్ తన సోదరులను రహస్యంగా కలుస్తున్నట్లు గుర్తించారు. చివరకు అక్టోబర్ 30న ఈశాన్య ఢిల్లీలోని శివ్ విహార్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. 1998లో హత్య చేసి దాదాపు 28 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. రోడ్డు ప్రమాదం కేసును 2000లో హత్య కేసుగా మార్చిన పోలీసులు అతడి కోసం అన్వేషణ ప్రారంభించారు. చివరకు 26 ఏళ్ల తర్వాత పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవ్వండి.. రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు..
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తొలి జాబితా విడుదలైన మరుసటి రోజే ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా..