ఓలా, ఉబర్, రాపిడోకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. మహిళల భద్రతపై కీలక ప్రతిపాదనలు..
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:35 PM
యాప్ ఆధారిత క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలు అందించే ఓలా, ఉబర్, రాపిడోలకు మహిళల భద్రతకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు నోటీలసులు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: యాప్ ఆధారిత క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలు అందించే ఓలా, ఉబర్, రాపిడోలకు మహిళల భద్రతకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల భద్రతకు ప్రైవేట్ రైడ్-హెయిలింగ్ సంస్థలను బాధ్యులను చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఓలా, ఉబర్, రాపిడో సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును డిసెంబర్ 16న తదుపరి విచారణకు తీసుకోనున్నట్లు పేర్కొంది (Delhi High Court, Ola Uber Rapido).
యాప్ ఆధారిత రవాణా సేవల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్రైవర్ల తనిఖీలపై మరింత దృష్టి అవసరమని అదిత్య సెహగల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఒక ప్రయాణికుడు క్యాబ్ లేదా బైక్ బుక్ చేసినప్పుడు యాప్‌లో కనిపించే డ్రైవర్, వాహనం వివరాలు, వాస్తవంగా కేటాయించిన డ్రైవర్, వాహనానికి సరిపోలేలా కఠినమైన ధ్రువీకరణ వ్యవస్థ ఉండాలని పిటిషన్‌లో కోరారు. అలాగే ఎస్‌ఓఎస్ అలర్ట్‌ల కోసం 24 గంటల కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిటిషనర్ ప్రతిపాదించారు (Passenger safety, PIL).
ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తేజస్ కారియాతో కూడిన ధర్మాసనం విచారించింది (women safety). ఓలా, ఉబర్, రాపిడోతో పాటు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. యాప్ ఆధారిత రవాణా సేవలను నిర్వహించే ప్రైవేట్ సంస్థలు ప్రయాణికుల భద్రత విషయంలో బాధ్యత వహించేలా చూడాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నోటీసులు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు..
రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..