Share News

ఆయనే మా అధిష్టానం.. యతీంద్ర సిద్ధరామయ్యపై డీకే చురకలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 08:45 PM

కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదంటూ ఎమ్మెల్సీ యంత్రీంద సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ఆయనే (యతీంద్ర) మా అధిష్టానం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

ఆయనే మా అధిష్టానం.. యతీంద్ర సిద్ధరామయ్యపై డీకే చురకలు
DK Shivakumar

బెంగళూరు: కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదంటూ ఎమ్మెల్సీ యంత్రీంద సిద్ధరామయ్య (Yatindra Siddaramaih) చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) శుక్రవారంనాడు స్పందించారు. 'ఆయనే (యతీంద్ర) మా అధిష్టానం' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. తన తండ్రి సిద్ధరామయ్య ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని యతీంద్ర ఇటీవల మైసూరులో తెలిపారు.


దీనిపై మీడియా అడిగిన్ ప్రశ్నకు డీకే స్పందిస్తూ, అధిష్టానం తరహాలో ఆయన ప్రకటనలు చేస్తున్నప్పుడు దాన్ని ఆమోదిస్తే సరిపోతుందని అన్నారు. 'ఆయనే మా హైకమాండ్, ఆయన ఏమి చెప్పినా నేను హుందాగా గౌరవిస్తాను' అని పేర్కొన్నారు.అధికారాన్ని పంచుకునేందుకు జరిగినట్టు చెబుతున్న ఒప్పందంపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే బసవరాజ చేసిన వ్యాఖ్యలపై కూడా డీకే ఆచితూచి స్పందించారు. బసవరాజు కానీ, యతీంద్ర కానీ చేసిన ప్రకటనలపై తాను స్పందించేది లేదని, దీనిపై ఏం చెప్పాలన్నా ఢిల్లీ అధిష్టానమే చెప్పాలని అన్నారు.


100 కాంగ్రెస్ ఆఫీసులకు శంకుస్థాపన

మార్చి నెలలో 100 కాంగ్రెస్ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఏఐసీసీ తేదీలు ఇచ్చినా ఇవ్వకున్నా పనులను ప్రారంభిస్తానని చెప్పారు. పుత్తూరులో కాంగ్రెస్ భవనం ప్రారంభోత్సవం కోసం తాను ఇక్కడకు వచ్చినట్టు మీడియాకు తెలిపారు. కేపీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మార్చి 10వ తేదీతో ఆరేళ్ల పూర్తవుతాయని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ భవనాల నిర్మాణం పనులను ప్రారంభించనున్నామని చెప్పారు. పుత్తూరులో శంకుస్థాపన కార్యక్రమానికి ముస్లింలను ఆహ్వానించలేదంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. కుల ఆధారిత రాజకీయాలను కాంగ్రెస్‌ విశ్వసించదని, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. కొందరు అసూయతో ఇలాంటి ఆరోపణలు చేస్తు్న్నారని అన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఒత్తిడి చేయలేం... సుప్రీంకోర్టు తీర్పు

‘ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు.. పబ్లిసిటీ కావాలా’: సుప్రీంకోర్టు

Updated Date - Feb 06 , 2026 | 09:14 PM